Chitika Ads

Inspirational Quotes !!

Saturday, February 12, 2011

Telangana -- Kavithvamu


పోరాడితె పోయేదేమి లేదు, బానిస సంకెళ్ళు తప్ప...
పోరాడితె ఒరిగేదీ ఎమి లేదు, ఒక్క తెలంగాణ తప్ప...

తల్లి కాదు తను మరి సవతి తల్లి,
విపరీతమా, మరి వైపరిత్యమా పక్షపాత ప్రేమ ప్రాతిపదికం..

అన్నలు కాదు వారు మరి మా దాయాదులు,
దుర్మార్గమా, మరి పైత్యమా ఈ పైశాచికం..

తమ్ముడి గుండె తెలుసునా నీకు,
మరి గుండె చీల్చుదువేల, సమైక్యత కాదా నీ కుట్రకు సాకు..

తెలంగాణమనివార్యమనీ నీకు తెలుసు, అత్యవసరమనీ తెలుసు
చేతకాదనుకోకు, చేయలేమనుకోకు, తీసుకోకు మంచితనాన్ని అలుసు..

ప్రభవించిన కొత్త తరం చైతన్యం చూడు,
విప్లవం వెనక దాగున్నది కుట్ర కాదు మరది కన్నీళ్ళ తడి గొంతుక..
తెలంగాణ తల్లి గుండె కోత..

అర్దం లేని ఆరాటం చూడు,
కల్లబొల్లి మాటలవి. వ్యాపారం, రాజకీయం కలిసిన దుర్మార్గపు అరమరిక..
సమైక్యత పేరుతొ తమ్మునికి పెడుతున్న వెత..

ఎందుకు కావాలి సమైక్యాంధ్ర?
ఎందుకు రావాలి తెలంగాణ?
కారణాలు బేరీజు వెయ్యి మరి ..
ప్రతిష్ట కాదు మరది మా అస్తిత్వ పోరాటం!

బలహీనమయ్యెనా నీ ఆత్మ గౌరవం,
నా చేతికి సంకెళ్ళు తెంచిన?
బలపడెనా మరది నా రెక్కలు తెంచి, నా చేతులు నరికి, నన్ను ఉరేసిన?
సరె,
తీసుకో అన్నా,
కాని కొన్ని షరతులు..

నా బతుకమ్మని పాతెయ్యి,
నా విద్యార్థి చేతుల నరికెయ్యి,
నా అరవయ్యేళ్ళ అర్ధ ప్రాజెక్టులని కూల్చెయ్యి..
నా రైతులందరికి దగ్గరుండి ఇంటికొక్క పురుగుల మందు పంచు..
లెక్క కాదు నీకది ఎన్నికల్ల ఎన్ని వందలు పంచుంటావులే..
నా నిరుద్యోగులకొక ఉరితాడు కొనియ్యి..
నా తెలంగాణ విలేఖరుల, న్యాయవాదుల గొంతుల కొయ్యి..
నా ఆడపడుచుల బొట్టు చెరచి, బొందపెట్టు..
నా శ్రామికుల కాళ్ళు నరుకు,
నా కన్నతండ్రి తల అడ్డంగ నరికెయ్యి..
మా అమ్మ గుండెల మీద తన్ను..
కంటి చూపుతో నా పల్లెల తగులబెట్టు..


నువ్వు కట్టిన కోట కింద మరి నా సమాధి తెలంగాణ పాట పాడుతుంది..
నీ ఇంటి చుట్టు పూచిన రెల్లు పూలు తెలంగాణ అమరవీరుల చెమట వాసనలు వెదజల్లుతాయి...
మా క్రిష్నమ్మ మా రక్తాన్ని మోసుకొస్తుంది మీ దగ్గరకు..

యేలుకో వల్లకాడు చేసి యేలుకో..
చాటి చెప్పు నీ జాతి గొప్పదనాన్ని మా శవాలమీద విజయగర్వంతో..
మా గుండెల్ల పాతు నీ తెలుగు జాతి సమైక్య ఝండా..
నీదే అన్న తెలంగాణ నీదె, నీ జాతి నీదె, నీ బలం నీదె,
నీ అధికారం, ఆధిపత్యం, వ్యాపారం, రాజకీయం.. అన్నీ నీవె..

చేస్తావ మరి..
మాటియ్యన్నా

No comments:

Post a Comment